AP: నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నామినేషన్ల పరిశీలన విషయంలో
టీడీపీ,
వైసీపీ మధ్య వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయానికి ఇరు పార్టీల నేతలు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిని బయటకు పంపాలంటూ
టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులతో ఎంపీ శబరి, ఏవీ సుబ్బారెడ్డి వాగ్వాదానికి దిగారు.