ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారిక
నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 21 నుండి 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆ తర్వాత 24న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తుది పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. అనంతరం నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించి, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.