ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

4583பார்த்தது
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, YCP నాయకులు బారికేడ్లను దాటి లోపలికి రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. దీనికి నిరసనగా YCP నేతలు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

தொடர்புடைய செய்தி