Oct 07, 2026, 17:10 IST/
యువతికి మరొకరితో పెళ్లి.. కాల్చి చంపిన ప్రియుడు
Oct 07, 2026, 17:10 IST
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమికురాలు చంచల్ వివాహం వేరే చోట నిశ్చయమవడంతో ఆగ్రహించిన కమల్ అనే యువకుడు, ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కాల్చి చంపాడు. ఈ ఘటనలో చంచల్ మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు కమల్ తన ఇంటికి వెళ్లి తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో అతని ప్రాణాలు దక్కాయి. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కమల్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె కుటుంబం అందుకు అంగీకరించలేదు.