Oct 01, 2026, 17:10 IST/
నమీబియా క్రికెటర్ సంచలనం.. 41 ఏళ్ల వయసులో హ్యాట్రిక్
Oct 01, 2026, 17:10 IST
నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్, 41 ఏళ్ల వయసులో తన కెరీర్లో మొదటి హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కెనడా సూపర్ 60 లీగ్లో వైట్ రాక్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో వీస్ ఈ ఘనత సాధించాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లోనూ సత్తా చాటిన వీస్, 2024 జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 15 వన్డేలు, 54 టీ20లు ఆడిన వీస్, పొట్టి ఫార్మాట్లో 434 మ్యాచ్ల్లో 358 వికెట్లు తీశాడు.