Oct 13, 2026, 11:10 IST/
VIDEO: పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురు మృతి
Oct 13, 2026, 11:10 IST
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి పెషావర్ వెళ్తున్న రెహమాన్ బాబా ఎక్స్ప్రెస్ ముల్తాన్లోని షేర్ షా బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 30 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 14 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.