ஸ்ரீ பெரும்பதூர் - Sri Perumbadhur

வீடியோஸ்


మంచిర్యాల జిల్లా
కాంగ్రెస్ పార్టీ అండ: పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
Sep 11, 2026, 14:09 IST/మంచిర్యాల
మంచిర్యాల

కాంగ్రెస్ పార్టీ అండ: పేద కుటుంబాలకు ఆర్థిక సాయం

Sep 11, 2026, 14:09 IST
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. లింగాపూర్ గ్రామానికి చెందిన రజిత ఆరేళ్ల కుమార్తెతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో, అనాథగా మారిన మూడేళ్ల బాబు సంరక్షణ కోసం అమ్మమ్మ, తాతయ్యలకు శుక్రవారం రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు. అలాగే, తాళ్లపేట్‌కు చెందిన కాలేయ వ్యాధితో బాధపడుతున్న బతిని మహేష్ చికిత్స కోసం రూ. 10,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో GCC చైర్మన్ కొట్నాక తిరుపతి, DCC ఉపాధ్యక్షులు ముద్దసాని వేణు, మాజీ ఎంపీపీ జాబు కాంతారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.