Sep 29, 2026, 17:09 IST/డోర్నకల్
డోర్నకల్
రోడ్డు భద్రతపై కలెక్టర్ ఆదేశాలు: కఠిన చర్యలు తీసుకోవాలి
Sep 29, 2026, 17:09 IST
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్, ఆర్ అండ్ బి, రవాణా, నేషనల్ హైవేస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో 'రోడ్డు భద్రత & ప్రమాదాల నివారణ'పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.