Sep 30, 2026, 16:09 IST/
తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు
Sep 30, 2026, 16:09 IST
థియేటర్లో సినిమా చూస్తూ పాటలకు డ్యాన్స్, డైలాగులకు విజిల్స్ వేయడం సాధారణమే. అయితే ‘ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ప్రదర్శనలో ప్రేక్షకులు ప్రసాదాలు పంచుకుంటున్నారు. తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రంలోని ‘ఛఠీ మైయా..’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఛఠ్ పూజ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ పాట వచ్చిన సమయంలో బిహార్ ప్రేక్షకులు ప్రసాదంగా స్వీకరించే ‘ఠెకువా’ స్వీట్ను తోటి ప్రేక్షకులకు పంచుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.