Oct 01, 2026, 16:10 IST/
దివ్యాంగులకు కేంద్రం శుభవార్త.. 'మినహాయింపు ఫాస్టాగ్' నిబంధనలు సడలింపు
Oct 01, 2026, 16:10 IST
జాతీయ రహదారులపై ప్రయాణించే దివ్యాంగులకు సులభతరం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన దివ్యాంగుల వాహనాలకు 'మినహాయింపు ఫాస్టాగ్' జారీ, పునరుద్ధరణ నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు 2026 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. 70-100% వైకల్యం ఉన్నవారికి ఫాస్టాగ్ ఐదేళ్లు, 40-70% వైకల్యం ఉన్నవారికి మూడేళ్లు చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల టోల్ చెల్లింపులు దివ్యాంగులకు సులభతరం కానున్నాయి.