Sep 29, 2026, 15:09 IST/
ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు
Sep 29, 2026, 15:09 IST
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మన్యం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.