Oct 28, 2026, 09:10 IST/
ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు ప్లాన్
Oct 28, 2026, 09:10 IST
ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌లోని వసుంధరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిమ్ ట్రైనర్ ప్రతాప్ సింగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియ, అడ్డుగా ఉన్న భర్త శశాంక్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సోమవారం ఉదయం ఇంట్లోకి ప్రవేశించిన ప్రతాప్, నిద్రిస్తున్న శశాంక్‌పై కత్తితో దాడి చేశాడు. కుమార్తె ఏడుపు, శశాంక్ అరుపులతో స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. గాయపడిన శశాంక్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు ప్రియ, ప్రతాప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.