Sep 29, 2026, 14:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
అంబులెన్స్‌లో పండంటి ఆడబిడ్డ జననం
Sep 29, 2026, 14:09 IST
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయికి మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఇచ్చోడ అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి, ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్‌లోనే ఈఎంటి రాకేష్ ప్రసవం చేయించారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పైలట్ నాగోరావు తెలిపారు.