ஸ்ரீரங்கம் - Srirangam

నల్గొండ జిల్లా
VB-GRAMG పథకంపై హరిజనాపురం గ్రామసభలో కీలక చర్చ
Oct 02, 2026, 12:10 IST/దేవరకొండ నియోజకవర్గం
దేవరకొండ నియోజకవర్గం

VB-GRAMG పథకంపై హరిజనాపురం గ్రామసభలో కీలక చర్చ

Oct 02, 2026, 12:10 IST
దేవరకొండ నియోజకవర్గంలోని హరిజనాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో VB-GRAMG పథకం ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఇంటికో ఇంకుడుగుంత, పొలాల్లో సాగునీటి బావులు, ఎండిపోతున్న బోర్లకు మరమ్మతులు, ధాన్యం ఎండబెట్టేందుకు కల్లాల నిర్మాణం వంటి పనులకు అవకాశాలపై వివరించారు. సర్పంచ్ తంగేళ్ల రామకృష్ణ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ పథకం టీఏ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.