Sep 30, 2026, 01:09 IST/
నేడు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
Sep 30, 2026, 01:09 IST
తెలంగాణలో పలు జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉదయం 8.30 గంటలలోపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, గద్వాల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.