Sep 30, 2026, 09:09 IST/
సిరిసిల్లలో అభివృద్ధిని చూసి నేర్చుకో: రేవంత్కు కౌశిక్ రెడ్డి సవాల్
Sep 30, 2026, 09:09 IST
TG: సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతమైనా కొడంగల్లో చేసి చూపాలని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ కొండారెడ్డిపల్లిలో కరెంట్ ఇవ్వడం లేదని రైతులు ధర్నా చేస్తున్నారని, సొంత నియోజకవర్గంలోనైనా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎంగా ఉన్నా ప్రజలు రేవంత్ వద్దకు కాకుండా, పరిష్కారం కోసం కేటీఆర్, హరీశ్రావు వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లలో జనసమీకరణ కోసం ఇతర జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.