Sep 23, 2026, 12:09 IST/
‘టాక్సిక్’ వసూళ్లకు చెక్ పెట్టిన ‘హనుమాన్ అన్ష్’!
Sep 23, 2026, 12:09 IST
బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అన్ష్’ మూవీ జోరు ఇంకా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.366 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ‘టాక్సిక్’ మూవీ సాధించిన రూ.342 కోట్ల వసూళ్లను ఈ మూవీ అధిగమించింది. అంతేకాకుండా.. ఈ మూవీ విడుదలైన 47వ రోజున కూడా రూ.4.90 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.366 కోట్ల మార్క్ను అందుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.