Sep 23, 2026, 15:09 IST/
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్ఛార్జ్ల నియామకం
Sep 23, 2026, 15:09 IST
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. తెలంగాణకు సునీల్ బన్సల్ను ఇన్ఛార్జ్గా, అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్ఛార్జ్లుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్కు అరవింద్ భదౌరియాను ఇన్ఛార్జ్గా, వనతి శ్రీనివాసన్ను కో-ఇన్ఛార్జ్గా నియమించింది. ఒడిశా ఇన్ఛార్జ్గా పురంధేశ్వరి, తమిళనాడు కో-ఇన్ఛార్జ్గా డీకే అరుణ పేర్లను ప్రకటించింది. ఈ నియామకాలు పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమన్వయం చేయడం, ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం లక్ష్యంగా చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.