Sep 10, 2026, 07:09 IST/
మహిళలకు గుడ్ న్యూస్.. విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు
Sep 10, 2026, 07:09 IST
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 221 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 96 క్యాంటీన్లలో ఈ పార్లర్లను నెలకొల్పనుండగా.. అనంతరం అన్ని క్యాంటీన్లకు విస్తరించనున్నారు. ఒక్కొ పార్లర్ ఏర్పాటుకు రూ.2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ మొత్తం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రుణంగా అందించనుంది. ఈ పార్లర్లలో విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయం సంపాదించవచ్చు.