Oct 06, 2026, 17:10 IST/బాన్సువాడ
బాన్సువాడ
అసైన్మెంట్ భూములకు యజమాని హక్కు కల్పించాలని ఎమ్మార్పీఎస్ వినతి
Oct 06, 2026, 17:10 IST
కామారెడ్డి జిల్లా, బాన్సువాడలో మంగళవారం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సర్వగల రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో మహ్మద్ నగర్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మండల పరిసర ప్రాంతాల్లోని అసైన్మెంట్ భూములకు యజమాని హక్కు కల్పించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భూమేష్ మాదిగ, బంగారు రవి, రాజు, రవి, పర్వయ్య, రాములు, సాయిలు, శ్రీమన్, దుర్గయ్య, సాయిలు, బాలరాజు పాల్గొన్నారు.