Sep 04, 2026, 08:09 IST/
ట్రాఫిక్ ఉల్లంఘనలకు గ్రేడెడ్ పాయింట్లు: గడ్కరీ
Sep 04, 2026, 08:09 IST
ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించే వాహనదారులకు కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు గ్రేడెడ్ పాయింట్ల విధానం తీసుకొచ్చే అంశాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) 66వ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు డ్రైవింగ్ రికార్డులో ప్రతికూల పాయింట్లు నమోదవుతాయి. ఈ పాయింట్లు నిర్దిష్ట పరిమితికి చేరితే లైసెన్స్ సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది.