Sep 17, 2026, 02:09 IST/కామారెడ్డి
కామారెడ్డి
అవగాహనతోనే హెచ్ఐవి నివారణ సాధ్యం
Sep 17, 2026, 02:09 IST
అవగాహనతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ బృందం ప్రతినిధులు డాక్టర్ తిరుమల్ రావు, కే. రమేష్ తెలిపారు. దోమకొండలో బుధవారం వై. ఆర్. జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామపంచాయతీ, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి, మహిళా గ్రామ సంఘాలను వారు సందర్శించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హెచ్ఐవి, సుఖ వ్యాధుల ప్రచార నిమిత్తం గోడలపై వేయించిన రాతలను పరిశీలించారు. గ్రామపంచాయతీ సహకారం పై పాలక వర్గాన్ని అభినందించారు.