Sep 04, 2026, 02:09 IST/
సీఎం చెప్పిందే ఫైనల్.. రేవంత్కు అధిష్టానం ఫుల్ సపోర్ట్!
Sep 04, 2026, 02:09 IST
TG: సీఎం రేవంత్ రెడ్డి మాటకే కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యం ఇచ్చింది. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిలపై వేటు ద్వారా గీత దాటితే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఇచ్చింది. సీఎం, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఎవరైనా సరే ఊరుకోబోమని తేల్చి చెప్పింది. ఇష్టారీతిన విమర్శలు చేస్తున్న నేతలకు ఇది ఓ హెచ్చరిక లాగా చేసింది. కాగా అధిష్ఠానం తీసుకున్న చర్యలు సీఎంకు మరింత బలం చేకూర్చాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.