Sep 23, 2026, 09:09 IST/
అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు: పొంగులేటి
Sep 23, 2026, 09:09 IST
TG: రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడంతో, ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 24 గంటలూ కంట్రోల్ రూమ్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.