Sep 17, 2026, 10:09 IST/
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి
Sep 17, 2026, 10:09 IST
ఆంధ్రప్రదేశ్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా రాతపరీక్షను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఈనెల 13, 14 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.