Sep 21, 2026, 13:09 IST/
టీచర్ను కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
Sep 21, 2026, 13:09 IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న 26 ఏళ్ల నిషాత్ ఫాతిమాను, ఆమెకు తెలిసిన 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ సోమవారం ఉదయం 11:30 గంటలకు స్కూల్ కారిడార్లో కలిశాడు. మాట్లాడుతుండగానే, సౌద్ తన వద్ద ఉన్న తుపాకీతో ఫాతిమాను కాల్చి చంపి, అక్కడికక్కడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించి, మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు.