Sep 05, 2026, 17:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
Sep 05, 2026, 17:09 IST
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.