Sep 28, 2026, 01:09 IST/
ద్రోణి ప్రభావం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
Sep 28, 2026, 01:09 IST
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో TGలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఉమ్మడి ADLB, నిజామాబాద్, కరీంనగర్, WGL, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.