Sep 28, 2026, 08:09 IST/
రకుల్ ప్రీత్ సింగ్ ఇల్లు, ఆఫీసులపై రెయిడ్స్
Sep 28, 2026, 08:09 IST
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ, నిర్మాత వాషు భగ్నానీకి చెందిన 'ప్యానోరమా స్టూడియోస్' కార్యాలయాల్లో ఆదాయపు శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబయిలో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. సినిమా ప్రాజెక్టుల నిధుల పేరుతో విదేశాలకు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఆర్థిక రికార్డులు, విదేశీ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.