Sep 22, 2026, 14:09 IST/
హైదరాబాద్లో వర్షం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
Sep 22, 2026, 14:09 IST
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, కూకట్పల్లి, ట్యాంక్ బండ్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, లింగంపల్లి మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.