22ఏ.. సీఎస్‌కు NHRC నోటీసులు

785பார்த்தது
22ఏ.. సీఎస్‌కు NHRC నోటీసులు
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో తీసుకున్న చర్యలపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈమేరకు చర్యలు తీసుకుంది.

தொடர்புடைய செய்தி