పలు కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 కేసుల్లో 4,912 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో బాటిళ్లను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.