
ఆర్టీసీ బస్సులో మందుబాబు హల్ చల్
ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని మహోర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం సేవించి హల్ చల్ చేసాడు. కండక్టర్ సీటులో కూర్చుని ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడంతో పలుమార్లు బస్సు నిలిచిపోయింది. విసిగిపోయిన ప్రయాణికులు మహారాష్ట్రలోని మాండీవీ పోలీస్ స్టేషన్ వద్ద బస్సును ఆపి, సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. మందుబాబు తాంసీ మండలం గిరిగాం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.




























