ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గించడానికి తోడ్పడుతుంది. అయితే అధిక బరువు ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.