30 ఏళ్లు దాటాయా?.. ఈ పరీక్షలు తప్పక చేయించుకోండి!

3934பார்த்தது
30 ఏళ్లు దాటాయా?.. ఈ పరీక్షలు తప్పక చేయించుకోండి!
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. 30 ఏళ్లు దాటిన తర్వాత రక్తపోటు, కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర, మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. లిపిడ్‌ ప్రొఫైల్‌తో పాటు జీవితంలో కనీసం ఒక్కసారైనా లిపోప్రొటీన్‌(ఎ) లేదా ఎల్‌పీ(ఎ) పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అలాగే సమతుల్య ఆహారం, వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అన్నారు.

தொடர்புடைய செய்தி