మరోసారి సౌతాఫ్రికా చేతిలో ఆసీస్‌ చిత్తు

7943பார்த்தது
మరోసారి సౌతాఫ్రికా చేతిలో ఆసీస్‌ చిత్తు
సౌతాఫ్రికాతో జరిగిన మూడవ టెస్టులో ఆస్ట్రేలియా 176 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగుల వెనుకబాటులో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా అద్భుతంగా పోరాడి మ్యాచ్ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో SA స్పిన్నర్ హార్మర్ 10 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్ సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది. స్కోర్లు: SA-329&387, AUS-429&111

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி