అదుపుతప్పిన ఆటో.. యువతి మృతి

4791பார்த்தது
అదుపుతప్పిన ఆటో.. యువతి మృతి
TG: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 ఏళ్ల కంచం ఇందు అనే యువతి మృతి చెందింది. సింగీతం గ్రామానికి చెందిన ఇందు, బాన్సువాడ వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా, కొయ్యగుట్ట వద్ద డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలైన ఇందును బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

தொடர்புடைய செய்தி