ఆటో, లారీ ఢీ.. నలుగురి మృతి

1பார்த்தது
ఆటో, లారీ ఢీ.. నలుగురి మృతి
TG: వికారాబాద్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి ఆటోలో ప్రయాణిస్తుండగా, బుగ్గరామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி