ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ‘పిఠాపురం నిండుగా అభివృద్ధి పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ఓ అంధ బాలిక కలిసింది. చిన్నారి వేమన పద్యం వినిపించి, అందులోని లక్షణాలన్నీ పవన్లో ఉన్నాయని పేర్కొంది. చిన్నారి మాటలకు ముగ్ధుడైన పవన్ ఆమెను అభినందించారు.