పడవ ప్రమాదం.. 24 మంది దుర్మరణం

12பார்த்தது
పడవ ప్రమాదం.. 24 మంది దుర్మరణం
నైజీరియాలోని దక్షిణ బయేల్సా రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఒక పడవ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 24 మంది మృతి చెందినట్లు నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) అధికార ప్రతినిధి మాంజో ఎజెకి వెల్లడించారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సదరన్ ఇజావ్ జిల్లాలో అయామా నుంచి వెళ్తుండగా, ఒవీకోరోఘా, ఒటువాన్ ప్రాంతాల మధ్య నదీ సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

தொடர்புடைய செய்தி