HYDలో బాంబులు పేలుతాయంటూ బెదిరింపులు

586பார்த்தது
HYDలో బాంబులు పేలుతాయంటూ బెదిరింపులు
హైదరాబాద్‌లో బాంబులు పేలుతాయని పోలీసులకు లష్కర్‌ ఏ తోయిబా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. 26/11 ముంబయి తరహా దాడి చేస్తామని, కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని అందులో హెచ్చరించారు. తమ నేత లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తామని పేర్కొన్నారు. ఈ బెదిరింపు మెయిల్‌తో స్పందించిన స్పెషల్‌ బ్రాంచ్ అధికారులు, నగర పోలీసులను అప్రమత్తం చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక నిఘా ఉంచారు.

தொடர்புடைய செய்தி