దసరా సందర్భంగా అక్టోబర్ 20న బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అయితే అక్టోబర్ 21న కూడా బ్యాంకులు మూసి ఉంటాయా అనే సందేహం నెలకొంది. RBI సెలవుల జాబితా ప్రకారం, విజయదశమి, దుర్గాపూజ సందర్భంగా బెంగళూరు, తిరువనంతపురం, కోల్‌కతా, కొచ్చి, గువాహటి, గ్యాంగ్‌టక్, అగర్తలా, షిల్లాంగ్ వంటి నగరాల్లో బుధవారం బ్యాంకులు పనిచేయవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం అక్టోబర్ 21న బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. అక్టోబర్ 24న నాలుగో శనివారం, 25న ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు బ్యాంకులకు సాధారణ సెలవులు. సెలవు రోజుల్లోనూ ఏటీఎంలు, యూపీఐ, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా చాలా లావాదేవీలు చేసుకోవచ్చు.