దేశవ్యాప్త జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2027 పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. యూజీ కోర్సులకు 10+2లో 45 శాతం, పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీలో 50 శాతం మార్కులు సాధించిన
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష డిసెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది. చివరి నిమిషం రద్దీని నివారించడానికి
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.