TG: సీఎం రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహించనున్న ఈ సదస్సుపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.