TG: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన
కాంగ్రెస్,
బీజేపీ పార్టీలకు చెందిన ఆదివాసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ సమక్షంలో వీరు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా
కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతుందని, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన నాయకులు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, రైతులు, గిరిజనులు, యువత, మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.