ఫోన్ కోసం కన్న బిడ్డను అమ్మేసిన దంపతులు

2938பார்த்தது
ఫోన్ కోసం కన్న బిడ్డను అమ్మేసిన దంపతులు
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో స్మార్ట్‌ఫోన్, బంగారు గొలుసు కోసం నెల రోజుల పసికందును అమ్మేసిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న జంట తమ బిడ్డను రూ.1.20 లక్షలకు అమ్మగా, 48 గంటల్లో నలుగురి చేతులు మారి చివరికి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి రూ.3.5 లక్షలకు కొనుగోలు చేశాడు. డబ్బుల విషయంలో జంట మధ్య గొడవతో ఈ అమానుష ఘటన బయటపడటంతో.. తల్లిదండ్రులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆ బిడ్డను తిరిగి మహారాష్ట్రకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

தொடர்புடைய செய்தி