పోలీస్ యూనిఫామ్‌లో డాన్స్ చేయొద్దు: DGP

2477பார்த்தது
పోలీస్ యూనిఫామ్‌లో డాన్స్ చేయొద్దు: DGP
TG: పోలీసులు విధి నిర్వహణలో లేదా ప్రైవేట్ వేడుకల్లో యూనిఫామ్ ధరించి డాన్సులు చేయడంపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు. ఇటువంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని, ఇది క్రమశిక్షణారాహిత్యమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో పోలీసులు యూనిఫామ్‌లో డాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడం, వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, యూనిఫామ్ గౌరవాన్ని కాపాడాలని ఆదేశిస్తూ అంతర్గతంగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி