ఆఫీసు లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ వినియోగించవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ నేరాల నిరోధక విభాగం వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఇలా పబ్లిక్ కంప్యూటర్లలో లాగిన్ చేసి వదిలేయడం వల్ల, సైబర్ నేరగాళ్లు మీ ఖాతాను సులభంగా తమ ఆధీనంలోకి తీసుకుని, మీ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఫిషింగ్, స్కామ్‌లు, ఇతర మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రతి సెషన్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలని సూచించింది.