తాజా మటన్‌ని గుర్తించేందుకు ఈ ట్రిక్స్ ట్రై చేయండి!

1பார்த்தது
తాజా మటన్‌ని గుర్తించేందుకు ఈ ట్రిక్స్ ట్రై చేయండి!
సండే వచ్చిందంటే మటన్ ప్రియులకు మాంసం తప్పనిసరి. అయితే, కొనేటప్పుడు మాంసం స్వచ్ఛతను పట్టించుకోరు. పాత లేదా నాసిరకం మాంసం వల్ల కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. తాజా మటన్‌ను గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. మాంసాన్ని తాకితే స్ప్రింగ్ లాగా పైకి లేస్తే అది తాజాది. లేదంటే గుంట పడినా, జిగురుగా ఉన్నా అది పాడైపోయినట్లే. తాజా మటన్ ముదురు ఎరుపు లేదా లేత గులాబీ రంగులో మెరుస్తూ ఉంటుంది. పాతబడిన మాంసం బూడిద లేదా గోధుమ రంగులోకి మారుతుంది. మంచి మటన్‌కు అసహ్యకరమైన వాసన ఉండదు. కొవ్వు తెలుపు రంగులో గట్టిగా ఉండాలి. పసుపు రంగులో ఉంటే అది రోగగ్రస్థ పశువుల మాంసం కావచ్చు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி