బెండకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్లో పెట్టకండి. తేమ వల్ల అవి త్వరగా నల్లగా, మెత్తగా, జిగురుగా మారొచ్చు. ముందుగా పొడి పేపర్ టవల్లో చుట్టి, పూర్తిగా గాలి చొరబడని డబ్బాలో కాకుండా కొంత గాలి ప్రసరణ ఉండే కంటైనర్ లేదా గుడ్డ సంచిలో ఉంచాలి. ఫ్రిజ్లోని కూరగాయల డ్రాయర్లో పెట్టడం మంచిది. నల్లగా మారిన లేదా మెత్తబడిన బెండకాయలను వెంటనే వేరు చేయాలి. వండే ముందు మాత్రమే నీటితో శుభ్రంగా కడగాలి. అప్పుడే బెండకాయల కూర రుచిగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.